సంక్రాంతి పండుగకు పెరుగుదానం చేయడం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. దానం చేయాలనే ఆలోచన రావడమే మంచిది. వచ్చిన ఆలోచనను అమలు చేయడం ఇంకా ఉత్తమమైన ఫలితాన్ని అందిస్తుంది. కాబట్టి పెరుగును ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లోనూ తప్పకుండా దానం చేయాలి. దానివలన అనంతమైన ఐశ్వర్యం వస్తుందని పండితులు సూచిస్తున్నారు.