పీఎఫ్ ఖాతా ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) గరిష్ట పరిమితి రూ.15 వేల నుంచి రూ. 21వేలకు పెంచాలని యోచిస్తున్నారు. దీంతో కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి రిటైర్ అయిన వారికి ఇచ్చే పింఛన్ రూ.7,500 నుంచి రూ.10 వేలకు పెరుగే అవకాశం ఉంది. సర్వీసు కాలాన్ని బట్టి, బేసిక్ ఆధారంగా ఇది మారుతుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.