బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ పాదయాత్ర చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మరో విధంగా సంచలనం అయింది. పాదయాత్ర ఇప్పుడు చేయడమేంటి అని కూడా ఒక చర్చ మొదలైంది. అయితే పాదయాత్ర చేస్తే ఓట్లు వేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న?. పాదయాత్రలకు ఓట్లు రాలే కాలం కాదు ఇది అని కూడా అంటున్నారు. పాదయాత్ర వల్ల గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుస్తాయి. పార్టీ గురించి ఒక అవగాహన వస్తుంది. దాని వరకు చక్కదిద్దుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.