చియా సీడ్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇందులోని అధిక మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. చియా సీడ్స్‌లో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల ఆకలిని తగ్గించి, మనం తినే ఆహారాన్ని తక్కువగా చేస్తుంది.