TG: గతేడాది 10 శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు. 'కరోనా కన్నా డేంజరస్ వైరస్ కాంగ్రెస్. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారు. చెత్త నిర్ణయాలతోనే, మతిలేని సీఎం ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే.. రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలుతున్నాయి' అని Xలో ట్వీట్ చేశారు.