సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాజోలు మండలం పాలగుమ్మిలో ఏర్పాటు చేసిన మంగళవారం రాత్రి అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. అలాగే కోడి పందేలు నిర్వహించగా వివాదం చెలరేగి పలువురు కొట్టుకున్నారు. దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి వరకు జూదాలు, రికార్డింగ్ నిర్వహించినా పోలీసులు పట్టించుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.