తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ హోదాలో మూడు రోజుల క్రితం రేవంత్రెడ్డి మహారాష్ట్రకు వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థుల పక్షాన విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. రేవంత్ ప్రచారానికి మహారాష్ట్ర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.