ఉచిత ఇసుకపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు, లభ్యత పెంచేందుకు సీనరేజి రద్దు చేసినట్లు సీఎం పురుద్ఘాటించారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో తరలింపు అధికంగా జరుగుతోందని, ఆయా మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ఠ పర్యవేక్షణ ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.