ఏపీలో గ్రూప్-2 పరీక్షలపై గందరగోళం నెలకొనడంతో సీఎం చంద్రబాబు APPSCపై ఆగ్రహం వ్యక్తం చేశారు. CM ఆదేశాలపై APPSC స్పందించకోవడంతో ఆయన మండిపడ్డట్లు తెలుస్తోంది. గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోర్టులో మార్చి 11న విచారణ దృష్ట్యా అప్పటి వరకు పరీక్ష వాయిదా వేయాలని APPSCకి లేఖ రాశారు. రిజర్వేషన్ రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ అభిమతమని CM తెలిపారు