హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం శ్రీనగర్ కాలనీ మెడ్ ప్లస్ వద్ద ఓ కారు డివైడర్ పైకి దూసుకొచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం కారు డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదంలో కారు ముందు బాగం ధ్వంసం అయింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులను పికప్-డ్రాపింగ్ చేసే కారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.