ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉంది. సరైన నాయకుడ్ని నియమిస్తే సత్తా చాటతామని చెబుతోంది. కానీ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం వేచిచూసే ధోరణిలో ఉంది. సరైన టైమ్‌లో సరైన నాయకుడ్ని బరిలోకి దింపుతామని చెబుతోంది. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో కార్యకర్తల్లో నిరాశ పెరుగుతోంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కారు లేని డ్రైవర్‌గా మారింది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనే నేత కోసం కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది.