దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ముంబై వస్తున్న విస్తారా విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం రాత్రి 787 బోయింగ్ విమానం 147 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ మేరకు బుధవారం ముంబైలో సేఫ్గా ల్యాండ్ అయినట్లు విస్తారా అధికారి తెలిపారు.