రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేలు కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు. రెండు లక్షల పైన రుణమాఫీ ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. భద్రాచలం శ్రీ రామచంద్రుడు సాక్షిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన రుణమాఫీ వాగ్దానం నెరవేర్చామని తెలిపారు. గిట్టుబాటు వచ్చేలా సీసీఐ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లు ఉంటాయని చెప్పారు.