నానబెట్టిన పెసరపప్పు తింటే చాలా లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. పెసరపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తింటే మలబద్దకం సమస్య రానే రాదు. పేగు సమస్యల నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. ఈ సమస్యకు కూడా పచ్చి పెసరపప్పు చెక్ పెడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.