బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకు భారీ ఊరట లభించింది. ‘ఇస్కాన్’పై నిషేధానికి బంగ్లాదేశ్ కోర్టు నిరాకరించింది. ఇస్కాన్ కార్యకలాపాలను నిషేధించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది ఎండీ మోనీర్ ఉద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఇస్కాన్‌పై నిషేధాన్ని విధించడం కుదరదని తేల్చిచెప్పింది.