డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లింగ్లో ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియాపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆయన తాజాగా స్పందించారు. ఇది ప్రభుత్వ ప్రతీకార చర్య అని, బీజేపీలో చేరితే నిషేధాన్ని రద్దు చేస్తుందన్నారు. డోప్టెస్ట్ చేసేందుకు మా ఇంటికి వచ్చినప్పుడు.. అధికారులు గడువు ముగిసిన కిట్ తీసుకొని వచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో వెల్లడించాను’’ అని పునియా తెలిపారు.