బొమ్మ తుపాకీతో ఓ వ్యక్తి బ్యాంకులో దోపీడికి యత్నంచి అడ్డంగా బుక్కై పోయిన ఘటన కోల్‌కతాలో జరిగింది. దలీమ్ బసు అనే వ్యక్తి పలు చోట్ల అప్పులు చేశాడు. అప్పులు తీర్చడం కోసం బ్యాంకును లూటీ చేయాలని ప్లాన్ చేశాడు. దీంతో బొమ్మ తుపాకీ తీసుకొని శుక్రవారం సాయంత్రం ఓ బ్యాంకులోకి ప్రవేశించి బ్యాంకు సిబ్బంది, కస్టమర్లను బెదిరించాడు. అయితే అతడి వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ అని వారికి తెలియడంతో పట్టుకొని పోలీసులకు అప్పగించారు.