ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో.. ఆసియాలోనే అతిపెద్దదైన గామా రే టెలిస్కోప్ ను లద్దాఖ్ లో ఆవిష్కరించారు. 4,300 మీటర్ల ఎత్తులో ఉన్న హాన్లే ప్రాంతంలో అతిపెద్ద ఇమేజింగ్ చెరెన్ కోవ్ టెలిస్కోప్ ను ప్రారంభించారు. మేజర్ అట్మాస్పియరిక్ చెరెన్ కోవ్ ఎక్స్పరిమెంట్ గా పిలిచే ఇది ప్రపంచంలోని టెలిస్కోప్ లలో అత్యంత ఎత్తయినది. BARC, ECIL, ఇతర పారిశ్రామిక సంస్థలు దీన్ని సంయుక్తంగా రూపొందించాయి.