తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు ప్రకటించారు. దీంతో టీ బీజేపీ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడు ధర్మపురి అర్వింద్కేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు కూడా రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు తెలిసిందే.