అధికారులు నిద్రపోతున్నారా?: మాగనూర్‌ ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

83பார்த்தது
అధికారులు నిద్రపోతున్నారా?: మాగనూర్‌ ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
నారాయణపేట జిల్లా మాగనూర్‌ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించింది. 'వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులకు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా? అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు' అని హైకోర్టు ఆక్షేపించింది. వారంలో కౌంటర్‌ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

தொடர்புடைய செய்தி