అమెరికా ఉపాధ్యక్ష రేసులో AP అల్లుడు!

60பார்த்தது
అమెరికా ఉపాధ్యక్ష రేసులో AP అల్లుడు!
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై APలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష రేసులో ఉన్న వాన్స్‌ సతీమణి ఉషా మూలాలు వడ్లూరులో ఉండటంతో వారు రిపబ్లికన్‌ పార్టీ విజయాన్ని కాంక్షిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్షుడి పదవికి రేసులో ఉన్న జేడీ వాన్స్‌ సతీమణి చిలుకూరి ఉషా కుటుంబం వడ్లూరు నుంచి అమెరికాలో స్థిరపడింది. ఉషా తల్లిదండ్రులు 60వ దశకంలోనే అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

தொடர்புடைய செய்தி