కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. 'రేవంత్ దోపిడీపై బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు. రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ సీఎం రేవంత్ బామ్మర్దితో పాటు మంత్రి పొంగులేటి కంపెనీలకే కట్టబెడుతున్నారు. గతంలో తాగు, సాగు నీటి ప్రాజెక్టులను కేసీఆర్ యుద్ధప్రాతిపదికన చేపట్టారు. కానీ ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు' అని విమర్శించారు.