ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఉక్రెయిన్ పర్యటన తర్వాత, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌తో శాంతి చర్చలలో భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తులుగా వ్యవహరించవచ్చని అన్నారు. మీరు చర్చలకు సిద్ధమా? అనే ప్రశ్నకు "మేం చర్చలకు ఎప్పుడు కూడా నిరాకరించలేదు" అని పుతిన్ బదులిచ్చారు. "ఇస్తాంబుల్ లో అంగీకరించిన అంశాల ఆధారంగా చర్చలు జరిపేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం" అని పుతిన్ పేర్కొన్నారు.