జార్ఖండ్‌లోని గొడ్డాలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతానికి చెందిన ఓ లోకోపైలెట్ ఈనెల 29న వివాహం చేసుకోబోతున్నాడు. అయితే, తన పెళ్లి కార్డులో 'పెళ్లికి హాజరయ్యే ముందు అతిథులంతా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో తమవంతు పాత్ర పోషించాలి. మొదట ఓటు వేయండి.. తర్వాత పెళ్లికి రండి' అని శుభలేఖలో ముద్రించాడు. దీంతో కార్డును చూసిన వారంతా ఆ లోకోపైలెట్ రాజ్‌కుమార్‌ను మెచ్చుకుంటున్నారు.