మట్కాపై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం

15539பார்த்தது
మట్కాపై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం
కాగజ్ నగర్ మండలం చింతగూడ గ్రామంలో సట్టా‌ మట్కా ఆడుతున్న ఒకరిని టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో చింతగూడలో తనిఖీలు చేపట్టగా అబ్దుల్ మెహమూద్ వద్ద మట్కాకు సంబంధించిన చిట్టీలు లభ్యయ్యాయి. అతని వద్ద రూ. 4320 నగదు స్వాధీనం చేసుకుని కాగజ్‌నగర్‌ రూరల్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదు చేసినట్టు టాస్క్ ఫోర్స్ సీఐ తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி