బిజెపి క్రియాశీల సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి
ప్రతి గ్రామంలో బిజెపి క్రియాశీలక సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి సూచించారు. సోమవారం భైంసాలో ఏర్పాటు చేసిన మండల ఇంచార్జిల సమావేశం లో క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. వందమంది సభ్యత్వ నమోదు చేసిన వారికి మాత్రమే పార్టీ సంస్థాగతంగా పదవులు ఇవ్వబడతాయని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సభ్యత్వ నమోదు చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు.