కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

481பார்த்தது
కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
మావల గ్రామంలో నూతనంగా ఏర్పడిన ఉషోదయ కాలనీ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సర్పంచ్ ప్రమీలా రాజేశ్వర్ అన్నారు. కాలనీవాసుల అభీష్టం మేరకు ఆదివారం కాలనీకి ఉషోదయ కాలనీ గా నామకరణం చేసి సూచికలను ఆవిష్కరించారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాలనీకి నిధులు వెచ్చించి దశల వారీగా పలు అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మావల జడ్పిటిసి నల్ల వనితా రాజేశ్వర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని అన్నారు. కాలనీవాసులు అతిథులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్, వార్డు సభ్యులు అజీజ్ ఖాన్, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు రహీమ్ ఖాన్, కాలనీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మాధవరావు, వామన్ రావు, శ్రీనివాస్ బలిరాం భీమ్రావు, వినోద్, సోనియా రావు, సుభాష్ , గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி