ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో చికిత్స పొందుతున్న కుష్టు వ్యాధిగ్రస్తులను నిరంతరం పర్యవేక్షణ చేయాలని డిప్యూటీ పారామెడికల్ అధికారి సిడాం వామన్ రావ్ ఆశా కార్యకర్తలకు సూచించారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైనథ్ పీహెచ్సి పరిధి నుండి నూతన కుష్టు రోగుల నమోదు శాతం ఎక్కువగా ఉందన్నారు. చికిత్స పొందుతున్న రోగులు సక్రమంగా మందులు వాడేలా చూడాల్సిన భాద్యత ఆశా కార్యకర్తలదే అని పేర్కొన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి ఆయా గ్రామాల్లో అధికారులు సూచించిన విధంగా సర్వే చేపట్టాలని సూచించారు. రోగులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందెలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశం లో డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ అనిత, పర్యవేక్షకులు సుశీల, వేణు, రమణాచారీ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.