వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం జిల్లా కలెక్టర్

449பார்த்தது
వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం జిల్లా కలెక్టర్
కరోనా పాండమిక్ లో వైద్య సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. తలమడుగు మండలంలోని ఉమ్రీ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కరోనా సమయములో తమ అమూల్య సేవలను అందించిన తలమడుగు వైద్య సిబ్బందిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను కలెక్టర్ సత్కరించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కు చెందిన స్పెషల్ అసిస్టెంట్ కాడే స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఊమ్రి గ్రామం వందశాతం కోవిడ్ వాక్సిన్ వేసుకోవడం స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాల ప్రజలు తమ తమ గ్రామాల్లో 100% కరోనాటీకాలు తీసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉప వైద్యాధికారి డాక్టర్ సాధన, డాక్టర్ వైసిశ్రీనివాస్, డిప్యూటీ పారా మెడికల్ అధికారి వామన్ రావు, సుభాష్, ఆనందరావు, డాక్టర్ రాహుల్ గ్రామపెద్దలు రామారావు పటేల్ , పెందూర్ మాధవరావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி