కుష్ఠు రోగులు క్రమం తప్పకుండా మందులు వాడాలని డిప్యూటీ పారా మెడికల్ అధికారులు వామన్ రావ్, మధుసూదన్ రావ్ లు రోగులకు సూచించారు. మంగళవారం బేల మండలంలోని టాక్లి గ్రామంలో పలువురు కుష్టు రోగులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తులు బహుళ ఔషధ చికిత్స ప్రతి నెల తీసుకునేలా ఆశా కార్యకర్తలు చూడాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్త వర్ష తదితరులు పాల్గొన్నారు