ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ పిట్టలవాడ రహదారి ప్రమాదకరంగా తయారైంది. దస్నాపూర్ జాతీయ రహదారి నుంచి పిట్టల వాడ వెళ్లే రహదారి పూర్తిగా మోకాళ్ళ లోతు గుంతల మయంగా తయారై తరచూ ప్రమాదాలకు కారణం అవుతుంది. చిన్నపాటి వర్షానీకే గుంతల్లో వరద నీరు చేరడంతో వాహనదారులు గుంతలను తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.