బెల్లంపల్లి: కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే సన్న రకాలను విక్రయించాలని అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. బెల్లంపల్లి మండలం బుచ్చయ్య పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. దళారులకు విక్రయిస్తే మద్దతు ధరలు లభించవన్నారు. సన్న రకాలకు రూ. 500 బోనస్ చెల్లిస్తారని వివరించారు. గ్రామాల్లో తక్కువ ధరలకు కొనుగోలు చేసే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.