మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిర మహిళ శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని మెప్మా రాష్ట్ర కోఆర్డినేటర్ కృష్ణ చైతన్య పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో రుణ సాయంతో మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సందర్శించి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.