ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతన కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టానికి విరుద్ధంగా మార్కెట్ కి చెందిన వ్యక్తికి కాకుండా జైనథ్ మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి ఆకొలి గ్రామానికి చెందిన మునిగేలా విఠల్ అనే వ్యక్తికి మార్కెట్ కమిటీ పగ్గాలను అప్పచెప్పడానికి ప్రోసిడింగ్ కాపీని కూడా విడుదల చేసింది. కానీ ఆదిలాబాద్ మార్కెట్ పరిధిలోని వ్యక్తికి రావాల్సిన చైర్మన్ పదవిని చట్ట విరుద్ధంగా వేరే మండలానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తలెత్తుకున్నాయి.