ఆదిలాబాద్ జిల్లా మున్నూరుకాపు సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య అధ్యక్షతన హైదరాబాద్ లో ఎన్నుకున్నారు. సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా కాళ్ళ విట్ఠల్, ప్రధాన కార్యదర్శిగా కలాల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా కైపెళ్లి జైపాల్, ఉపాధ్యక్షులుగా గంట సురేష్, సమన్వయకర్తగా సంతోష్, కార్యవర్గ సభ్యులుగా శ్రీధర్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా దేశెట్టి ప్రభావతి లను ప్రకటించారు.