సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇళ్ల సంఖ్య గుర్తింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పట్టణంలోని వార్డ్ నెంబర్ 37 ఓల్డ్ హౌసింగ్ బోర్డులో చేపట్టిన ఇళ్ల సంఖ్య సర్వే తీరును కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఇళ్ల సర్వే చేపట్టి స్టిక్కర్లను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, కౌన్సిలర్ అంబకంటి అశోక్, తదితరులున్నారు.