బేల మండల కేంద్రంలోని సుప్రసిద్ధ మహంకాళి ఆలయం గురువారం భక్తజన సంద్రంగా మారింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేక పూజలు, హారతులతో కొలుస్తున్నారు. ఆలయంలో జరిగే ప్రత్యేక హారతి సమయంలో భక్తులు భారి ఎత్తున హాజరవుతున్నారు. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారికి హారతి అందచేస్తున్నారు. హారతి అనంతరం భక్తులకు పండ్ల పంపిణి చేపడుతున్నారు.