ఆదిలాబాద్ పురపాలకశాఖకు చెందిన 17 దుకాణాలను అద్దె ప్రాతిపదికన అప్పగించేందుకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఖమర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాత మున్సిపల్ ఆఫీస్‌లో 13, పాత బస్టాండ్ లో రెండు శివాజీచౌక్ లో రెండు షాప్స్ ఉన్నాయన్నా ఈనెల 30 లోపు కార్యాలయంలో ఆసక్తి గలవారు దరఖాస్తులను చేసుకోవాలన్నారు. వచ్చె నెల నవంబర్ 2న మున్సిపల్ కార్యాలయంలో ఈ వేలం ప్రక్రియ ఉంటుందన్నారు.