కుమార్తె పేరు ప్రకటించిన నటి దీపికా పదుకొణె

66பார்த்தது
కుమార్తె పేరు ప్రకటించిన నటి దీపికా పదుకొణె
దీపికా పదుకొణె - రణ్‌వీర్‌ సింగ్‌ దంపతుల ముద్దుల కూతురు పేరును ప్రకటించారు. దువా పదుకొణె సింగ్‌ అని నామకరణం చేసినట్టు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘దువా అంటే ప్రార్థన. మా ప్రార్ధనలకు సమాధానమే ఈమె’’ అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీనిపై అభిమానులతో పాటు అలియా భట్, మమిత, షాలిని పాండే తదితర సినీ తారలు స్పందించారు. ‘క్యూట్‌’ అంటూ లవ్‌ ఎమోజీలు జోడించారు.

தொடர்புடைய செய்தி