ఓ పెళ్లి బృందం కోసం రైలు కొన్ని నిమిషాల పాటు నిరీక్షించిన ఘటన కోల్కత్తాలోని హౌరా రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. పెళ్లి బృందం ముంబయి నుంచి గౌహతి వెళ్లే క్రమంలో గీతాంజలి ఎక్స్ప్రెస్ ఎక్కారు. అయితే ఆ ట్రైన్ లేటు కావడంతో తర్వాతి ట్రైన్ అందుకోలేమని ట్విట్టర్ ద్వారా రైల్వే అధికారుల సాయాన్ని కోరారు. డీఆర్ఎం స్పందించి రైలును కాసేపు ఆపారు. దీంతో పెళ్లి వారు హౌరాలో దిగి వెంటనే సరాయ్ఘాట్ ఎక్స్ప్రెస్లో గౌహతి వెళ్లారు.