ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ఫోర్స్ ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి.. బాధ్యులను గుర్తించనుంది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్సేఫ్టీ కమిటీలను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.