సాధారణ కారులతో పోల్చితే సన్రూఫ్ ఉన్న కార్ల ధర ఎక్కువగా ఉంటుంది. ఓ వ్యక్తి తన కారును బిల్డింగ్ పక్కన పార్క్ చేశారు. హఠాత్తుగా ఒక కోతి కారు సన్రూఫ్పై పడటంతో అది పగిలిపోయింది. కోతి కారులో పడిపోయి గాయాలు కాకుండా బయట పడింది. ఇది అంతా అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. కారుకు తిరిగి కొత్త సన్రూఫ్ బిగించాలంటే చాలా ఖర్చవుతుందని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.