గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్ లపై తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సమగ్ర ప్రకటన చేయనుంది. గ్రూప్ -1 పరీక్షలు, జీవో 29పై శనివారం మంత్రులు రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశమయ్యారు. అభ్యర్థుల విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అభ్యర్థులు నష్టపోకుండా తీసుకునే చర్యలపై మంత్రుల చర్చలు కొనసాగాయి. ఇక ఇవాళ ప్రభుత్వం సమగ్ర ప్రకటన చేయనుంది. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.