వన్డేల్లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ బాది నేటితో 15 ఏళ్లు పూర్తయింది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా సచిన్ ఆనాడు చరిత్ర సృష్టించారు. 2010 ఫిబ్రవరి 24న సౌతాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు చేసి సచిన్ నాటౌట్‌గా నిలిచారు. 25 ఫోర్లు, 3 సిక్సర్లతో సౌతాఫ్రికా బౌలర్లకు సచిన్ చుక్కలు చూపించారు. సచిన్ 463 వన్డేల్లో 18,425 రన్స్ చేశారు. టెస్టుల్లో సచిన్ 6 డబుల్ సెంచరీలు చేశారు.