Jun 15, 2024, 09:06 IST/కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బదిలీ
Jun 15, 2024, 09:06 IST
కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా 2016 బ్యాచ్ కు చెందిన ఆశిష్ సంగ్వాన్ ను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ పని చేస్తున్న జితేష్ వి పాటిల్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్ పని చేస్తున్న సంగ్వాన్ స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని భివాని. అమెరికాలోని జార్జియా టెక్ యూనివర్సిటీలో చదివారు.