Mar 22, 2025, 12:03 IST/
నోటికి వచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: KCR
Mar 22, 2025, 12:03 IST
నోటికి వచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని BRS అధినేత కేసీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాకా ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని విమర్శించారు. మేనిఫెస్టోలో పెట్టకున్నా రైతు బంధు, కల్యాణలక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గోదావరిఖని నుంచి మాజీ MLA కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర ఫామ్‌హౌస్‌కు చేరుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.