తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను స్పీకర్ కు అందజేశారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి అడిగిన ప్రశ్నకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుదోవ పట్టించే సమాధానం ఇచ్చారని ఆరోపించారు. తక్షణమే కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు అనుమతించి, చర్యలు తీసుకోవాలని కోరారు.