Feb 25, 2025, 17:02 IST/
దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి (వీడియో)
Feb 25, 2025, 17:02 IST
కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నైతోడి గ్రామం పాలెదమర ప్రాంతంలో శోభ అనే ఓ మహిళ నడుపుతున్న కారు అదుపుతప్పింది. నేరుగా ఓ దుకాణంలోకి కారు అతివేగంగా దూసుకెళ్లింది. దుకాణం బయట కూర్చున్న ఓ వృద్ధ మహిళను కారు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సంఘటనా స్థలంలోనే ఆ వృద్ధురాలు చనిపోయింది. మృతురాలిని సుమతి (91)గా పోలీసులు గుర్తించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.