న్యూఢిల్లీలోని AIIMS వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. నాలుగు కాళ్లతో జన్మించిన 17 ఏళ్ల బాలుడికి శస్త్రచికిత్స చేయడం ద్వారా వైద్యపరంగా సరికొత్త ఘనత సాధించారు. అతని సాధారణ అవయవాలతో పాటు, కడుపుకు రెండు పాదాలు పుట్టుకతో పాటు వచ్చాయి. దేశంలోనే మొదటిసారి అరుదైన శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా నాలుగు కాళ్లు ఉన్న వ్యక్తుల కేసులు 42 మాత్రమే నమోదయ్యాయని వైద్యులు తెలిపారు.