Jul 14, 2024, 13:07 IST/వేములవాడ
వేములవాడ
ట్రాక్టర్ తో సహా బావిలో పడిన డ్రైవర్ శేఖర్.. గాలింపు చర్యలు
Jul 14, 2024, 13:07 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో పంట పొలాన్ని ట్రాక్టర్ సహాయంతో దున్నుతున్న కైరా శేఖర్(31)ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు. శేఖర్ కోసం స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బంది బావిలో గాలిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తో సహా డ్రైవర్ శేఖర్ పడిపోయినట్లు తెలుస్తోంది.